జోశర్మ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్’ (మూటీవ్ ఫర్ మర్డర్). స్వీయ దర్శకనిర్మాణంలో మోహన్ వడ్లపట్ల రూపొందించారు. త్వరలో తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని తీశాను.
ఇప్పటివరకు ఈ తరహా కథాంశం తెలుగు తెరపై రాలేదు. ఓ కిల్లర్ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వసంత్ ఇసాయిపట్టై, నిర్మాణం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల.