Drishyam 3 | మలయాళం నుంచి వచ్చిన క్రైం థ్రిల్లర్ జోనర్ ప్రాజెక్టుల్లో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సినిమాల్లో టాప్‌లో ఉంటుంది (Drishyam). ఈ క్రైం థ్రిల్లర్‌కు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్ (Mohan lal), మీనా కాంబోలో వచ్చిన ఈ ప్రాంఛైజీలో దృశ్యం 2 కూడా వచ్చింది. రెండు పార్టులు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
ఈ క్రేజీ సినిమాకు ఇక మూడో పార్టు కూడా రాబోతుందని తెలిసిందే. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. దృశ్యం 3 ఎప్పుడు మొదలవుతుందో చెప్పాడు. మరో రెండు రోజుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి షురూ కానుందని అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపాడు. దృశ్యం 3ను తెరకెక్కిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనుందని సమాచారం. దృశ్యం 3 అప్డేట్ రావడంతో సుమారు 5 దశాబ్ధాలుగా సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు మోహన్ లాల్ అభిమానులు.
2024లో పనోరమ స్టూడియోస్, గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ అండ్ జోట్ ఫిలిమ్స్ బ్యానర్లు దృశ్యం ప్రాంఛైజీ హాలీవుడ్ రీమేక్ రైట్స్ దక్కించుకున్నాయని తెలిసిందే. దృశ్యం 1, 2 నిర్మాతల (ఆశీర్వాద్ సినిమాస్) నుంచి అంతర్జాతీయ రీమేక్ రైట్స్‌ను పనోరమ స్టూడియోస్ దక్కించుకుంది. అంతేకాదు దృశ్యం సిరీస్ దక్షిణ కొరియాతోపాటు స్పానిష్ వెర్షన్లో కూడా సందడి చేయనుంది.
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
SYG | సాయి దుర్గ తేజ్ సంబరాల యేటి గట్టు విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ
They Call Him OG | ఓజీ కోసం రూల్ బ్రేక్ చేసిన పవన్ కల్యాణ్.. థమన్ కామెంట్స్ వైరల్