కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం మన దేశంలో ప్రళయం సృష్టిస్తుంది. రోజుకు లక్షల్లో కేసులు వస్తుండడం, వేలల్లో మరణాలు సంభవించడం భయాందోళనలు కలిగిస్తుంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పని సరి మాస్క్ ధరించడం, సంజీవని వంటి టీకా తీసుకోవడం ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు రెండు విడతలుగా టీకా తీసుకుంటున్నారు.
గత నెల ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు తిరుపతిలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక తాజాగా సెకండ్ డోస్ తీసుకున్న విషయాన్ని కూడా మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అంతేకాక ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకొని, బయటకు వెళ్లినప్పుడల్లా తప్పని సరిగా మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. మోహన్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
Done with my 2nd dose. I urge everyone to take the vaccine. And wear your mask every time you step out of your home. pic.twitter.com/0cKiWrWg8l
— Mohan Babu M (@themohanbabu) April 25, 2021