మోహన్ బాబు (Mohan Babu)కు మరో పరాభవం ఎదురైంది. ఒకప్పుడు ఆయన సినిమాలు వచ్చాయంటే కనీసం 10-15 రోజుల వరకు టికెట్స్ కూడా దొరికేవి కావు. కానీ ఇదంతా గతమే..గతం ఎంత ఘనమైనా ప్రస్తుతం ఏంటనేది ఇండస్ట్రీలో చూస్తుంటారు. ఒకప్పుడు 15 రోజుల వరకు టికెట్స్ దొరికేవి కాదు కానీ ఇప్పుడు మోహన్ బాబు సినిమాలకు పట్టుమని 150 టికెట్స్ కూడా తెగడం లేదనేది పచ్చినిజం. ఒప్పుకోడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు జరుగుతున్నది మాత్రం ఇదే.
ఈ మధ్యే ఈయన నటించిన సన్ ఆఫ్ ఇండియాకు వస్తున్న కలెక్షన్స్ చూసిన తర్వాత మోహన్ బాబు సినిమాలపై ప్రేక్షకులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థం అవుతుంది. ఈ సినిమాకు మొదటి రోజు కేవలం 6 లక్షల గ్రాస్ అంటే.. నెగిటివ్ షేర్స్ వచ్చాయి. అంటే ఒక్క రూపాయి కూడా రాలేదన్నమాట. చాలా చోట్ల జనం లేక షోలు కూడా క్యాన్సిల్ చేసారు. తెలుగు ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ, నాగార్జున పేరు మీదున్న అత్యంత చెత్త సినిమా ఆఫీసర్ (Officer Movie)రికార్డును ఇప్పుడు మోహన్ బాబు సొంతం చేసుకున్నాడు.
అప్పుడు ఆఫీసర్ సినిమాను రెండో రోజుకే చాలా చోట్ల తీసేసారు. కానీ సన్ ఆఫ్ ఇండియా సినిమాకు ఆఫ్టర్నూన్ షోలకే చాలా చోట్ల నిలిపేసారు. అధికారికంగా మొదటి రోజే 117 షోలు రద్దయ్యాయి. డైమండ్ రత్నబాబు (Diamond Ratna Babu) తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఏకపాత్రాభినయం చేసాడు. సినిమాలో కథ, కాన్సెప్ట్ అన్నీ పాతకాలం చింతకాయ పచ్చడిలా ఉండటంతో ఆడియన్స్ ఔట్ రేటెడ్గా తిరస్కరించారు. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చాయిప్పుడు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కూడా కలుపుకుంటే సన్ ఆఫ్ ఇండియా సినిమాకు కనీసం 30 లక్షల షేర్ కూడా రాలేదని లెక్కలు చెప్తున్నాయి. ఇది నిజంగా చాలా అంటే చాలా దారుణం. ఒప్పుకోడానికి ఇది కాస్త కష్టంగానే ఉంటుంది. ఏదేమైనా ఒకప్పుడు చరిత్ర ఎంత ఘనంగా ఉన్నా..ఇప్పుడేంటి అనేది మాత్రం ఇండస్ట్రీలో లెక్కలోకి వస్తుంది. ఈ నిజాన్ని మోహన్ బాబు ఒప్పుకుంటాడనే అనుకుంటున్నారు విశ్లేషకులు.