Bheemla Nayak party | భీమ్లా నాయక్ టీంకు పవన్ గ్రాండ్ పార్టీ..స్టిల్స్ హల్చల్..?
భీమ్లానాయక్ (Bheemla Nayak) విడుదలైన అన్ని సెంటర్లలో తన హవా కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 25న రిలీజైన ఈ చిత్రం మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లీడ్ రోల్లో నటించిన చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). సాగర్ కే చంద్ర (sagar k chandra) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో తన హవా కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 25న రిలీజైన ఈ చిత్రం మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే తొలి రోజు నిర్మాత నాగవంశి, త్రివిక్రమ్ అండ్ సాగర్ టీం కేక్ కట్ చేసి, టపాకాయలు పేల్చి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా పవన్ కల్యాణ్ పార్టీలు చేసుకోవడానికి దూరంగా ఉంటాడని తెలిసిందే.
తాజాగా పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ టీంకు పెద్ద పార్టీ ఇచ్చాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. సినిమా మంచి సక్సెస్ అందుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ టీంతోపాటు సన్నిహితులకు పార్టీ ఇచ్చాడట. తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలే దీనికి నిదర్శనం. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఇన్‌షర్ట్ వేసుకుని పవన్ కల్యాణ్, ఫుల్ టీషర్ట్‌లో త్రివిక్రమ్ అండ్ థమన్ టీం చిచ్చు బుడ్లు కాలుస్తూ సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి.
Usthaad @PawanKalyan At #BheemLaNayak Success Party ❤️📸#BheemlaNayakMASSJathara pic.twitter.com/QHpU7aLdfm
— PawanKalyan Universe (@PawanUniverse) February 27, 2022
మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌గా వచ్చిన భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. కోలీవుడ్ భామ నిత్యమీనన్, మాలీవుడ్ భామ సంయుక్తా మీనన్ కీలక పాత్రల్లో కనిపించారు. డానియల్ శేఖర్ పాత్రలో రానా నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

