రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్‌తో బిజీగా ఉంటుంది. లేదంటే వర్కవుట్స్,యోగా సెషన్‌తో తీరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు టైం దొరికితే చాలు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కు ప్లాన్ చేసుకుంటుంది. ఈ భామ ఈ సారి బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నాని ( Jackky Bhagnani) తో కలిసి టూర్ వేసింది. ఇటీవలే ఓ డైరెక్టర్ వెడ్డింగ్ కోసం ఆగ్రాకు వెళ్లిన ఈ జంట ఈ సారి మాత్రం వరల్డ్ ఫేమస్ టూరిజం లొకేషన్ మాల్దీవుల (Maldives)కు చెక్కేసింది. స్ట్రాపీ క్రాప్ టాప్, బాడీకాన్ స్కర్ట్‌లో, బీచ్ టోపీ, సన్ గ్లాసెస్‌తో బ్లూ ఐలాండ్‌లో సీ బ్యాక్ డ్రాప్ లొకేషన్లో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
మరోవైపు బీచ్ సైడ్ స్టిక్‌పై బ్లాక్ సూట్ డ్రెస్‌లో ఎద అందాలను ఆరబోస్తూ ఫొటోలు దిగింది. మరోవైపు జాకీభగ్నానితో సరదా సమయాన్ని ఆస్వాదించింది. రకుల్ నెట్టింట్లో స్టిల్ పెట్టిన వెంటనే లైక్స్, కామెంట్లు వరదలా వచ్చేశాయి. సమంత ఫైర్ ఐకాన్ ను జోడిస్తూ హాట్ అంటూ కామెంట్ పెట్టింది. మరోవైపు రాశీ ఖన్నా బ్యూటీ అంటూ రాసుకొచ్చింది. రకుల్ అఫీషియల్‌గా బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిన టూర్ ఫొటోలు ఫన్, హ్యాపీమూడ్, మంచి ఫుడ్‌తో నిండిపోయాయి.
రకుల్ మాల్దీవుల్లో ఎలా ఎంజాయ్ చేసిందో ప్రస్తుతం ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్న ఫొటోలే చెప్తున్నాయి.
ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. హిందీలో ఈ భామ 6 సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు తెలుగు, తమిళంలో ఓ ప్రాజెక్టు, తెలుగులో మరో సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.