Mohan Babu My kannappa Story | మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మంచు విష్ణు మీ లైఫ్‌లో కన్నప్ప ఎవరో అంటూ ఒక వీడియోను పంచుకోండి అంటూ అభిమానులను కోరాడు. ఇందులో భాగంగా తాజాగా మోహన్ బాబు ఒక వీడియోను పంచుకున్నాడు. నా లైఫ్‌లో కన్నప్ప మా అమ్మే అంటూ ఒక వీడియోను పంచుకున్నాడు.
ఒక అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు(కన్నప్ప).. పరమేశ్వరుడికి తన కళ్లు ఇచ్చి చరిత్రలో కన్నప్పగా మిగిలిపోయాడు. అలాగే మన ఆకలిని తెలుసుకుని మనకు అన్నం పెట్టేది అమ్మ. మనకు ఏది కావాలంటే అది వారి శక్తికి మించి అమ్మానాన్నలు మనకు ఇస్తారు. నా దృష్టిలో మా అమ్మానాన్నలు కన్నప్పలు అని మోహన్ బాబు అన్నారు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. దురదృష్టవశాత్తు ఆమెకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించేవి కాదు. ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదుగురు సంతానాన్ని ప్రసాదించాడు.
ఒకచోట బస్సు దిగి మేము ఇంటికి వెళ్లాలంటే.. సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఆ దారి కూడా అంతంత మత్రామే ఉండేది. మాది ద్వీపం లాంటి ఊరూ.. ఆ ఊరికి వెళ్లాలంటే.. ఒక కాలువ, సువర్ణముఖి నదిని దాటితేగాని ఊర్లోకి వెళ్లలేం. అలాంటి దారిలో చెవులు వినిపించని మా తల్లి ఐదుగురిని మోసుకుంటూ ఆ దారిలోనే ప్రయాణించేది. అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. అప్పుడప్పుడు ఈ విషయాలు తలుచుకుంటూ బాధపడేవాడిని. నా కంఠం బాగుందని అందరూ మెచ్చుకున్నప్పుడు ఈ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వరా అని ఎన్నిసార్లు వేడుకున్నానో లెక్కలేదు. నా జీవితంలో నా తల్లే నాకు కన్నప్ప అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యాడు.
#MyKannappaStory#kannappa #harharmahadevॐ pic.twitter.com/uFJUAE0qVg
— Mohan Babu M (@themohanbabu) June 5, 2025
Read More