న్యూఢిల్లీ: దేశంలో టూ వీలర్లు, కార్లు, మొబైల్ ఫోన్ల అమ్మకాలు తగ్గినట్లు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ప్రభుత్వం కేవలం కొంత మంది పెట్టుబడిదారులకు మాత్రమే పనిచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. కానీ తన పోస్టులో ప్రధాని మోదీ గురించి ఆయన ప్రస్తానవ చేయలేదు. గణాంకాలు వాస్తవం చెబుతాయని హిందీ భాష పోస్టులో ఆయన రాశారు. గత ఏడాది ద్విచక్ర వాహనాల అమ్మకాలు 17 శాతం, కార్ల అమ్మకాలు 8.6 శాతం, మొబైల్ మార్కెట్ 7 శాతం పడిపోయినట్లు రాహుల్ తెలిపారు. మరో వైపు ఖర్చులు, రుణాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇంటి అద్దె, ద్రవ్యోల్బణం, విద్యా ఖర్చులు.. అన్నీ భారం అవుతున్నట్లు ఆరోపించారు. ఇవి కేవలం గణాంకాలు కాదు అని, ఇవి వాస్తవాలు అని తెలిపారు. ఈ ఆర్థిక వత్తిడిలో సాధారణ పౌరుడు ఇబ్బందిపడుతున్నట్లు రాహుల్ తన పోస్టులో రాశారు.
आंकड़े सच बोलते हैं।
पिछले एक साल में टू-व्हीलर की बिक्री 17% और कार की बिक्री 8.6% घट गई है। वहीं मोबाइल मार्केट 7% गिर गया है।
दूसरी तरफ, ख़र्च और कर्ज़ – दोनों लगातार बढ़ रहे हैं: मकान का किराया, घरेलू महंगाई, शिक्षा का खर्च, लगभग हर चीज़ महंगी होती जा रही है।
ये सिर्फ़…
— Rahul Gandhi (@RahulGandhi) June 5, 2025