Modern Masters : S.S RAjamouli | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసిన విషయం తెలిసిందే. మాడర్న్ మాస్టర్స్ ఎస్.ఎస్ రాజమౌళి (Modern Masters: S.S. Rajamouli)పేరిటా ఈ డాక్యుమెంటరీ రాగా.. శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి తన గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
రాజమౌళి పర్సనల్ లైఫ్ గురించి ఇంటర్వ్యూ ఫార్మాట్లో ఈ డాక్యుమెంటరీ ప్రారంభంకాగా.. ఒకవైపు ఇంటర్వ్యూ జరుగుతునే మరోవైపు ఆయన మేకింగ్ స్టైల్‌తో పాటు.. రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా సహా తదితరులు జక్కన్నతో కలిసి పని చేసిన అనుభవాన్ని చెబుతున్న దృశ్యాలను చూపించారు.
ఎన్టీఆర్ స్టూడెంట్ నెం. 1 గురించి తెలియని విషయాలు వెల్లడించగా.. రామ్ చరణ్ మగధీర సినిమా గురించి తెలియని విషయాలను వెల్లడించాడు. ఇక వీరితో పాటు ప్రభాస్ బాహుబలి గురించి చెబుతూ.. బాహూబలి ఫస్ట్ పార్ట్ తెలుగులో ఫ్లాప్ టాక్ రావడం, హిందీలో బ్లాక్ బస్టర్ రావడం వంటి విషయాలను వెల్లడించాడు. ఇక హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరున్ ఆర్ఆర్ఆర్ సినిమా చూసి షాక్ అవ్వడం, తన వర్క్ గురించి మెచ్చుకోవడం ఇందులో కనిపించాయి.
ఈ డాక్యుమెంటరీలో తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు తన మూవీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యింది. తన మువీలకు చివరిలో ఏ ఫిల్మ్ బై ఎస్. ఎస్. రాజమౌళి అనే ట్యాగ్‌లైన్ ఎలా పుట్టుకు వచ్చింది లాంటివి రాజమౌళి వెల్లడించారు. బాహుబలి ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు షాక్ అయ్యానని.. అలాగే కట్టప్ప క్యారెక్టర్‌ను తక్కువ చేయడం అనేది ఎందుకు అనే విషయాలను వెల్లడించాడు. ఇదే కాకుండా తాను పిల్లన గ్రోవి అనే సినిమాలో కృష్ణుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినట్లు చెప్పి అందరిని షాక్‌కి గురిచేశాడు. అలాగే అర్థాంగి అనే సినిమాకు అసిస్టెంట్‌గా చేసినట్లు ఇందులో వెల్లడించారు. వీటితో పాటు రాజమౌళి గురించి తెలియని చాలా విషయాలను ఇందులో చెప్పినట్లు తెలుస్తుంది.
Also Read..
Watch: కారుతో స్టంట్ చేసిన మైనర్ బాలుడు.. స్కూటర్‌ను ఢీకొట్టడంతో మహిళ మృతి, బాలికకు గాయాలు
Minister Nadendla Manohar | రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు : మంత్రి నాదెండ్ల