స్టాలిన్‌ను కలిసిన కమల్ హాసన్

తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వెలువడిన ఫలితాలలో డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది. దీంతో పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ మే 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 234 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమి 152 స్థానాలలో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి.
మంగళవారం రోజు మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్.. స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు కూడా పుష్ప గుచ్ఛం ఇచ్చి కొద్ది సేపు ముచ్చటించారు. ప్రస్తుతం వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా, తమిళనాడులోని కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున పోటీ చేసిన కమల్ హాసన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి..
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కరోనా వేళ కలప సాయం
బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి
ప్లాస్మా మాకివ్వరూ!
వ్యాక్సినేషన్ పేరిట ఫేక్‌కాల్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

