Purushaha | పవన్ కళ్యాణ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం పురుష (Purushaha). సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. దమ్ముంటే నన్ను టచ్ చెయి అంది. ఒక్క రాంగ్ బటన్ నొక్కితే రిజల్ట్ ఇలా ఉంటుందా భయ్యా అంటూ రిలీజ్ చేసిన పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రతీ పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేస్తున్న మేకర్స్ తాజాగా ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి పాడిన మగాళ మీద జాలిపడేదెవ్వను పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట మగాళ్లకు కనెక్ట్ అవుతూనే.. ఆడవాళ్లను ఆలోచించేలా చేస్తుందని లిరిక్స్ చెబుతున్నాయి. ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనుందని చెప్పకనే చెబుతున్నాయి సాంగ్ విజువల్స్.
ఇప్పటికే షేర్ చేసిన పోస్టర్లలో పవన్ కల్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. మొత్తానికి బ్రహ్మచారి భర్తగా మారిన తర్వాత కదనరంగంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో ఫన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జాలి పడేదెవ్వడు మగాడి మీద జాలి పడేదెవ్వడు…#JaaliPadedhevvadu from #Purushaha is hitting close to home with its relatable lyrics about men’s struggles. MM Keeravani’s vocals add an extra layer of authenticity to the song, making it even more impactful#PurushaAnthem… pic.twitter.com/CYOrUuMaMi
— BA Raju’s Team (@baraju_SuperHit) January 24, 2026
Dhanush – Mrunal | ధనుష్‌తో పెళ్లి పుకార్ల మధ్య మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియో… షాక్ అవుతున్న నెటిజన్స్
MSG | లాంగ్ వీకెండ్ టార్గెట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’… మళ్లీ ఊపందుకున్న మెగాస్టార్ సినిమా
Rimi Sen | నటన రాదు అయిన స్టార్ అయ్యాడు.. జాన్ అబ్రహంపై రిమీ సేన్ సంచలన వ్యాఖ్యలు