Mirai | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ “మిరాయ్” సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఆరంభంలో వినిపించిన ప్రభాస్ వాయిస్ ఓవర్ అభిమానులను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కానీ తాజాగా, ఆ వాయిస్ ప్రభాస్ ఒరిజినల్ వాయిస్ కాదు అన్న వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. సినిమా స్టార్టింగ్‌లో కథా నేపథ్యాన్ని పరిచయం చేసే భాగంలో ప్రభాస్ గళం వినిపించింది. ఇది అభిమానులకు ఒక థ్రిల్లా అనిపించిందన్న సంగతి నిజమే. కానీ ఆ వాయిస్‌ను ఏఐ (Artificial Intelligence) టెక్నాలజీ ద్వారా రీక్రియేట్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రభాస్ అనుమతితోనే ఈ పనిని చక్కగా ప్లాన్ చేసి, చాలా నాణ్యతతో ఫినిష్ చేశారని సమాచారం.
ప్రభాస్ వాయిస్ డెలివరీ గురించి అభిమానులకి క్లారిటీ ఉంది. అయితే మిరాయ్లో వినిపించిన వాయిస్ చాలా క్లియర్‌గా, స్పీడ్‌గా, మృదుత్వంతో సాగింది. దీంతో ఇది ప్రభాస్ నిజమైన వాయిస్ కాదేమో? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఇది ఏఐ వాయిస్ జనరేషన్‌తో రూపొందించబడినదే అని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే… మిరాయ్ సక్సెస్ మీట్లో చిత్రబృందం మాత్రం ఈ విషయాన్ని ఓపెన్ చేయలేదు. అందరూ “ప్రభాస్ గారికి థ్యాంక్స్” అని మాట్లాడినప్పటికీ, ఏఐ వాడారని ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. కానీ సినీ నిపుణులు చెబుతున్నది ఏంటంటే, వాయిస్ టోన్, డెలివరీ అంతా ఏఐతోనే జరిగిందని అంటున్నారు.
ఇక చిత్రంలో రానా క్యామియో చేయగా, నిధి స్పెషల్ సాంగ్ చేసిందట. కాని నిధి అగర్వాల్ స్పెషల్ డాన్స్ నెంబర్ కట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చిత్ర బృందం ఈ విషయంపై స్పందించలేదు. కానీ అభిమానులు, టెక్ ఎక్స్పర్ట్స్ మాత్రం ప్రభాస్ వాయిస్ కచ్చితంగా ఏఐ టూల్స్ సహాయంతో రూపొందించారని అంటున్నారు. ఇక మిరాయ్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. చిత్రానికి అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో కలెక్షన్స్ కూడా పెరుగుతూ పోతున్నాయి.