సినిమాలతో ఎంటర్ టైన్ చేయడమే కాదు..అప్పుడపుడు తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఫన్ ట్రీట్ ఇస్తుంది తమన్నా. నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్ డేట్ తో ఫాలోవర్లలో జోష్ నింపే మిల్కీ బ్యూటీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఫన్ రీల్స్ నుంచి ఓ వీడియోను అందరితో షేర్ చేసుకుంది. తమన్నా దక్షిణాది, బాలీవుడ్ సినిమాల కోసం ముంబై టు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తిరుగుతూ బిజీగా ఉంది. అయితే ఈ భామ మేకప్, గ్రూమింగ్ (వస్త్రధారణ) సెషన్ లో సరదాగా హమ్ చేసింది.
మేకప్ రూంలో తమన్నా చుట్టూ నలుగురు అమ్మాయిలున్నారు. వారిలో ఒకరు మ్యూజిక్ ప్లే చేసిన వెంటనే అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. క్యూట్ డ్యాన్స్ వీడియోను తమన్నా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘కలిసి తిరిగే బృందం కలిసే ఉంటుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తమన్నా ప్రస్తుతం ఎఫ్ 3, సీటీమార్, గుర్తుందా సీతాకాలం, మ్యాస్ట్రో చిత్రాలతోపాటు మాస్టర్ చెఫ్ తెలుగు ప్రోగ్రామ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..