వెదురును మురళిగా మలిచి..ఈ వెదురును మురళిగా మలచి..నాలో జీవననాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన..నీకే నా హృదయ నివేదన.. మనసున కొలువై..మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం..(Merise taralade Rupam) ఇంతకన్నా తీయగా ఎవరైనా తమలోని భావాలన్ని వ్యక్తం చేయగలరా ? తేలికైన పదాలతో నిగూఢమైన భావాన్ని వ్యక్తం చేయడం సాధ్యమేనా? నిజంగా సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri) తెలుగు సినీ లోకానికి దొరికిన సాహిత్య మణిహారం.
భాషలోని మాధుర్యాన్ని..భావంలోని గాంభీర్యాన్ని.. అతి సుందరంగా, సరళంగా రాయడంలో సిరివెన్నెల దిట్ట. అద్భుతమైన అక్షర శిల్పి. సినీ గేయాన్ని సాహిత్య సంపదతో నింపేసిన మహాకవి. సిరివెన్నెల చిత్రంలో సీతారామశాస్త్రి రాసిన ఈ పాట ఆయన కెరీర్లో ఓ హైలెట్. మెరిసే తారలది ఏ రూపం.. విరిసే పువ్వులదే రూపం.. అది నా కంటికి శూన్యం.. అంటూ సీతారామశాస్త్రి ఎంత అలౌకి సాహిత్యాన్ని తెలుగు ప్రపంచానికి అందించారో మాటల్లో చెప్పలేం. ఆ కవిత్వ మధురిమలను పాటల్లోనే ఆస్వాదించాలి.
ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana) చిత్రంలో ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే.. అంటూ రాసిన పాట నేటి యువతకు తెలుగు పదకవితను పరిచయం చేస్తుంది. ఈ పాటలో సీతారామశాస్త్రి ప్రేమను నిర్వచించిన తీరు అనిర్వచనీయం. మేఘంలో నిద్దురపోయిన రంగులన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ప్రేమంటే.. ఇలాంటి గేయాలతో సిరివెన్నెల తెలుగు సినీ ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకున్నారు. సుపంపన్నమైన తెలుగు సాహిత్య సరిగమలను అతి రమ్యంగా తన పదాలతో పలికించారు.
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసినా..దరి దాటిన ఉరకలు వేసిన ఏ నదికైనా తెలిసిందా అని సీతారామశాస్త్రి ఈ పాటలో అనన్యసామాన్యమైన భావాన్ని వ్యక్తం చేశారు. సిరి పైరు ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా అంటూ సిరివెన్నెల చాటిన కవితా కళను ఆస్వాదించాల్సిందే. దశాబ్ధాల పాటు సినీ ప్రేక్షకుల్ని తన కలంతో అపురూప రీతిలో కవ్వించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించడం.. తెలుగు వెండి తెర వెలుగులు కోల్పోయినట్లే.
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు