Mem Famous | నూతన నటీనటులతో తెరకెక్కుతున్న టాలీవుడ్ ప్రాజెక్ట్ మేమ్ Famous (Mem Famous). సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి సుమంత్ ప్రభాస్ స్వీయదర్శకత్వం వహిస్తున్నాడు. మే 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుమంత్ ప్రభాస్ టీం సరికొత్త నిర్ణయం తీసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇంతకీ ఏంటా డెసిషన్ అనుకుంటున్నారా..?
మే 25న మేమ్ Famous స్పెషల్ ప్రీమియర్ షోలు స్క్రీనింగ్ వేయనుండగా.. టికెట్ ధర కేవలం రూ.99గా నిర్ణయించారు. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేయబడ్డ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ చిత్ర ప్రదర్శన ఉండబోతుంది. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గతంలో ఎవరూ ఫిక్స్ చేయనంత తక్కువగా టికెట్ ధ నిర్ణయించి హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని తెరకెక్కించిన ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ బ్యానర్లు మేమ్ Famous మూవీని తెరకెక్కిస్తున్నాయి.
స్నేహం, ప్రేమ, కుటుంబ అంశాల నేపథ్యంలో సాగే కథతో మేమ్ Famous తెరకెక్కుతోంది. ఈ మూవీ జూన్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన అయ్యయ్యో లిరికల్ వీడియో సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.ఈ సినిమా పంపిణీ హక్కులను టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే సుమంత్ ప్రభాస్ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. మరి సుమంత్ ప్రభాస్ టీం సరికొత్త నిర్ణయం సినిమాకు ఏవిధంగా కలిసొస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
#MemFamous tickets at Rs. 99/- for all Premieres and in SELECT SINGLE SCREENS on Day 1 across AP & TG 🎫🎟️
Premieres on May 25th and GRAND RELEASE on May 26th 🔥
Book your tickets now!
– https://t.co/x58Pk9YnVd@SumanthPrabha_s @SharathWhat @anuragmayreddy @ChaiBisketFilms… pic.twitter.com/2N6BuYiHSg— LahaRRRi Music (@LahariMusic) May 24, 2023
అయ్యయ్యో లిరికల్ వీడియో సాంగ్..