Disclosure Day | హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్(Steven Spielberg) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘డిస్క్లోజర్ డే’ (Disclosure Day). ఏలియన్స్, సైన్స్ ఫిక్షన్ కథాంశాలను ఆధారంగా చేసుకోని రాబోతున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా.. జూన్ 12, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ టీజర్ చూస్తుంటే.. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు రహస్యంగా ఉంచబడిన ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేసే సమయాన్ని ఈ చిత్రం సూచిస్తుంది. అయితే ఆ రహస్యం ఏంటి అనేది టీజర్లో సస్పెన్స్‌గా ఉంచారు మేకర్స్. ఉత్కంఠగా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. ‘ఓపెన్‌హైమర్’, ‘ఏ క్వైట్ ప్లేస్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఎమిలీ బ్లంట్(Emily Blunt) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. కోలిన్ ఫారెల్ (Colin Farrell), జోష్ ఓ’కానర్ ఈవ్ హెవ్సన్ (Eve Hewson), కీలక పాత్రల్లో నటిస్తున్నారు.