Ram Charan | టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆస్ట్రేలియాలో సందడి చేస్తున్నారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్(IFFM) వేడుకలు శుక్రవారం ప్రారంభంమైన విషయం తెలిసిందే. ఈ వేడుకలు ఆగస్ట్ 15 నుంచి 25 వరకూ ఘనంగా జరుగనున్నాయి.
అయితే ఈ వేడుకకు చెందిన IFFM 15 ఎడిషన్‌కు గౌరవ అతిథిగా రామ్‌చరణ్ హజరయ్యారు. మెల్బోర్న్లోని ఫెడరేషన్ స్క్వేర్ కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో ఉపాసనతో ఆయన పాల్గొన్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి రామ్ చరణ్ చేసిన సేవలకుగాను ‘ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్’ గా అవార్డును అందుకున్నాడు చెర్రీ. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. తన సినిమా ఆరెంజ్ రోజులను గుర్తు చేసుకున్నాడు.
సుమారు 14 ఏండ్ల క్రితం ‘ఆరెంజ్’ సినిమా కోసం ఆస్ట్రేలియా వచ్చాను. మగధీర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా చేశాను. ఒక నెల కంటే ఎక్కువే షూటింగ్ జరిగింది. ఆరెంజ్ షూటింగ్ అయిపోయినప్పుడు చాలా ఎమోషనల్‌కు గురయ్యాను. ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమను తాను ఇప్పటికీ మర్చిపోలేకున్నానని. మెల్బోర్న్లో ఇంతమంది భారతీయులను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని చరణ్ పేర్కొన్నారు. ఇక్కడికి వస్తే.. నా ఇంటికి వచ్చినట్లే ఉంటుందని.. నాకు దక్కిన గుర్తింపు మీ అందరి వల్లే ఇది సాధ్యమైంది. ఈ ఈవెంట్ నాకు ఎప్పుడు స్పెషల్ అంటూ రామ్ చరణ్ చెప్పుకోచ్చాడు. అనంతరం అభిమానులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసిన రామ్ చరణ్ వారితో కలిసి ఫొటోలు దిగాడు.
Mega Power Star @AlwaysRamCharan owning the Stage & Crowd with his undeniable SWAG!!🔥🔥#MelbourneHonorsRamCharan#RamCharan #GameChanger #RC16 #TeluguFilmNagar pic.twitter.com/8BrJLXHXMJ
— Subhodayam Subbarao (@rajasekharaa) August 17, 2024
Also read..