Mahanati Savitri | సావిత్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి
Megastar Chiranjeevi | మహానటి సావిత్రి సినీ జీవితంపై వచ్చిన తాజా పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్’ (Savitri Classics). ఈ పుస్తకాన్ని సంజయ్ కిషోర్ రచించగా.. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పబ్లిష్ చేసింది. ఇక ఈ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరుగగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Megastar Chiranjeevi | మహానటి సావిత్రి సినీ జీవితంపై వచ్చిన తాజా పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్’ (Savitri Classics). ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సంజయ్ కిశోర్ రచించగా.. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పబ్లిష్ చేసింది. ఇక ఈ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరుగగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సావిత్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చిరు భావోద్వేగానికి లోనయ్యారు.
మహానటి సావిత్రిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు చాలా ఆనందగా ఉంది. ఈ పుస్తక ఆవిష్కరణకు వారధిగా నిలబడడం నాకు దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తాను. ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం వలన నా జన్మ సార్ధకమైంది అని చిరంజీవి వెల్లడించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. సావిత్రి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. నాకు తల్లిలాంటి సావిత్రిగారి గురించి చెప్పడానికి ఉద్వేగంతో మాటలు రావడం లేదు. నా యాక్టింగ్ కోర్స్ పూర్తికాకుండానే నాకు ‘పునాదిరాళ్లు’ (Punadhirallu) సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ వెళ్లేటప్పుడు నేను సావిత్రి గారితో కలిసి నటిస్తున్నానని నాకు తెలిసింది. ఆ విషయం తెలియాగానే నాకు షాక్ కొట్టినట్లు అనిపించింది. అయితే షూటింగ్ అనంతరం నన్ను సావిత్రి గారి వద్దకు తీసుకువెళ్లగా.. ఆవిడను చూడగానే నాకు మాట రాలేదు. ఈ మహానటినేనా ఇన్నాళ్లు నేను ఆరాధించేది అంటూ చిరు చెప్పుకోచ్చాడు. నన్ను చూసి ‘నీ పేరేంటి బాబు’? అని అడిగింది. ‘చిరంజీవి’ అని చెప్పాను. ఆమె ‘శుభం’ అన్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్లో వర్షం పడగా డ్యాన్స్ చేస్తూ కింద పడ్డాను.. నేను వర్షంలో కూడా డ్యాన్స్ చేయడం ఆపలేదు. ఇది చూసిన సావిత్రి నా దగ్గరకు వచ్చి ఫ్యూచర్లో మంచి నటుడివి అవుతావు అంటూ మెచ్చుకుంది అంటూ చిరు చెప్పుకోచ్చాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
MEGASTAR #Chiranjeevi about #Savitri garu,She is a Legendary Actress,she have seen my dance ,she Motivated my,I have worked with her in 2 movies Punadhi Rallu,Prematharangalu, I always watch her movies,songs
Boss @KChiruTweets #SavitriClassics book launch #MegastarChiranjeevi pic.twitter.com/S8WlGmwWdg— Chiranjeevi Army (@chiranjeeviarmy) April 2, 2024
ఈ వేడుకకు రచయిత సంజయ్ కిశోర్, నిర్మాత అల్లు అరవింద్, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, సావిత్రి కుమారుడు సతీశ్ కుమార్, మురళీ మోహన్, జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

