SSMB 29 | దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా రేంజ్‌ను హాలీవుడ్ వరకు తీసుకెళ్లాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఎప్పుడు ఉంటుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu)తో సినిమా చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. ఎస్ఎస్ఎంబీ 29గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని రాజమౌళి అప్పట్లో వెల్లడించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ షూటింగ్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు నిర్మాత కె.ఎల్.నారాయణ.
ఈ మూవీ షూటింగ్‌పై కె.ఎల్.నారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. గత కొన్ని నెలలుగా పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు లేదా సెప్టెంబరులో షూటింగ్ మొదలు కావొచ్చు. ఈ సినిమా స్టోరీ చాలా బాగుంది. బడ్జెట్ ఎంత అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ ఎంత అవసరమైన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ నిర్మాత కె.ఎల్.నారాయణ చెప్పుకొచ్చారు.
ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ.. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా ఆర్.సి.కమల్ కణ్ణన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మోహన్ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్‌గా రమా రాజమౌళి పని చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే నెలలో మూవీ కూడా లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఇందులో హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సమాచారం.