బెంగుళూరు: ఇంట్లో పని మనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ(HD Revanna) బెయిల్ దరఖాస్తును వెనక్కి తీసుకున్నారు. బెంగుళూరు సెషన్స్ కోర్టులో ఆయన ఆ పిటీషన్ పెట్టుకున్నారు. వేధింపుల కేసులో హెచ్డీ రేవణ్ణపై నాన్ బెయిలబుల్ అభియోగాలు ఏమీ లేవని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొన్నది. హసన్ జిల్లాలోని హోలెనర్సిపురా నియోజకవర్గం నుంచి రేవణ్ణ జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. హెచ్డీ రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న ఓ మహిళ ప్రజ్వల్‌తో పాటు హెచ్డీ రేవణ్ణపై కూడా వేధింపుల కేసును నమోదు చేసింది. అయితే ఆ కేసులో నాన్ బెయిలబుల్ అభియోగాలు ఏమీ లేవని సిట్ తెలిపింది. దీంతో హెచ్డీ రేవణ్ణ తన బెయిల్ పిటీషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.