Shaitaan Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘షైతాన్’. ఈ సినిమాకు వికాస్ బెహల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ హారర్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకోగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మే 03 సాయంత్రం నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
సినిమా కథ విషయానికి వస్తే.. వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన అజయ్ దేవగన్ కుటుంబం అక్కడ ఒక అపరిచిత (మాధవన్) వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది. అయితే ఆ అపరిచిత వ్యక్తి ప్రయోగించిన బ్లాక్ మ్యాజిక్ నుంచి అజయ్ దేవగన్ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేది అనేది అసలు కథ. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాను సంయక్తంగా నిర్మిస్తున్నారు. గుజరాతీ హారర్ థ్రిల్లర్ ‘వష్’ (Vash) సినిమాకు ఈ చిత్రం రీమేక్‌గా వచ్చింది.
From Tonight…. #Shaitaan on Netflix. pic.twitter.com/km6MsCzKjH
— Christopher Kanagaraj (@Chrissuccess) May 3, 2024