Mega 154 | ఆచార్య సినిమా తర్వాత చిరంజీవిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆ సినిమా అనుకున్న దానికంటే దారుణంగా విఫలం కావడంతో.. తర్వాత సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి అభిమానుల ఆకలి తీర్చాలని కసి మీద ఉన్నాడు మెగాస్టార్. అందుకే తర్వాత సినిమాల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఒక విషయంలో మాత్రం చిరంజీవి తన పాత రోజులను బాగా గుర్తు చేసుకుంటున్నాడు.
మెగాస్టార్ చిరంజీవికి ఈ జనరేషన్ హీరోయిన్ల కంటే ఒకప్పటి హీరోయిన్లతోనే చనువు ఎక్కువగా ఉంది. 80, 90 దశకాల్లో మెగాస్టార్‌తో జోడి కట్టని హీరోయిన్లు లేరు. ఎంతోమంది సీనియర్ హీరోయిన్లతో ఈయన కలిసి నటించాడు. అలాగే నేటితరం హీరోయిన్లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే తాజాగా తన సినిమాల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నాడు చిరంజీవి. ప్రస్తుతం కానీ.. ఇకపై నటించబోయే సినిమాల్లో కానీ ఏదైనా కీలక పాత్రలు ఉంటే.. కచ్చితంగా వాటికోసం తనతో నటించిన పాత హీరోయిన్లను తీసుకోవాలని దర్శకులకు మెగాస్టార్ రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమాలో ఇప్పుడు నయనతార నటిస్తున్న పాత్ర కోసం విజయశాంతిని అప్రోచ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె కూడా కన్ఫర్మ్ చేసింది. కాకపోతే రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా చిరంజీవి సినిమాను విజయశాంతి ఒప్పుకోలేదు. అలాగే శోభనను కూడా ఈ పాత్ర కోసం అడిగారు.. ఆమె కూడా గాడ్ ఫాదర్లో నటించడానికి నిరాకరించింది. చివరికి ఇప్పుడు నయనతార ఈ పాత్రలో నటిస్తోంది.
ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో సీనియర్ హీరోయిన్ సుమలత ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ కూడా నటిస్తున్నాడు. ఈ మధ్యే షూటింగ్లో జాయిన్ అయ్యాడు మాస్ రాజా. ఈయన తల్లి పాత్రలో సుమలత నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు శుభలేఖ, ఖైదీ, పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కలిసి నటించారు చిరంజీవి, సుమలత. అలాంటి హీరోయిన్ తో మళ్లీ తన సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాడు మెగాస్టార్. ఏదేమైనా ఒకప్పటి హీరోయిన్లతో మళ్ళీ కలిసి నటిస్తే వచ్చే మజా వేరు అంటున్నాడు చిరు. ఈ దిశగా దర్శకులు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది వర్కౌట్ అయితే మెగాస్టార్ వింటేజ్ కాంబినేషన్స్ చూసే అదృష్టం అభిమానులకి కూడా దక్కుతుంది.
“చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ పశ్చాత్తాపం”