Ravi Teja | మెగాస్టార్ సినిమా కోసం ఖాకీ యూనిఫాంలో రవితేజ..!
సిల్వర్ స్క్రీన్ పై చాలా ఏళ్ల తర్వాత రవితేజ-చిరంజీవి (Chiranjeevi) సందడి చేయబోతున్నారన్న వార్తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. మెగాస్టార్ చిరంజీవి 154వ (#Mega154) చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు రవితేజ.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ (Ravi Teja). ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి 154వ (#Mega154) చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై చాలా ఏళ్ల తర్వాత రవితేజ-చిరంజీవి (Chiranjeevi) సందడి చేయబోతున్నారన్న వార్తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. ఇప్పటికే బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు రవితేజ. అయితే రవితేజ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో రవితేజ మరోసారి పోలీసాఫీర్‌గా కనిపించబోతున్నాడని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతున్న షూటింగ్లో రవితేజ పాల్గొంటున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. రవితేజపై వచ్చే సీన్లు చిత్రీకరిస్తున్నారట. రవితేజ 2 నెలల్లో తన పాత్ర షూటింగ్ పూర్తిచేసి..హీరోగా చేస్తున్న నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. రవితేజ పోలీసాఫీర్‌గా కనిపించిన విక్రమార్కుడు, క్రాక్ సినిమాలు బాక్సాపీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
మరి ఈ సారి ఏకంగా మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, అందులోనా పోలీస్ పాత్ర కావడం సినిమాకు బాగా కలిసొస్తుందని అనుకుంటున్నారు సినీ జనాలు. కీ రోల్ కోసం రవితేజ అడిగినంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మైత్రీ మూవీ మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో చిరంజీవి ఫిషర్‌మెన్‌గా (మత్స్యకారుడు) కనిపించనుండగా..వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Read Also : Raghava Lawrence | తలైవా ఆశీస్సులు తీసుకున్న లారెన్స్..స్పెషల్ ఏంటంటే..!
Read Also : Pushpa All Time Record | ట్రెండ్ సెట్టర్‌గా ‘పుష్ప’..ఏ సినిమా సాధించని కొత్త రికార్డు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

