టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తోన్న తాజా చిత్రం ఏజెంట్ (Agent). యాక్షన్ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కిక్, రేసు గుర్రం, సైరా వంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి (Surenderreddy) డైరెక్ట్ చేస్తున్నాడు. తాజా మూవీ లవర్స్ కోసం మేకర్స్ టీజర్ (Agent Teaser)ను లాంఛ్ చేశారు.
ఎంతో అపఖ్యాతి మూటగట్టుకున్న, అత్యంత క్రూరమైన దేశభక్తుడు..అనే డైలాగ్స్ ఓ వైపు, మరోవైపు మమ్ముట్టి ఫైరింగ్ సీన్లతో షురూ అయింది టీజర్. మిస్టర్ మహదేవ్ (మమ్ముట్టి రోల్) ఆఫీసర్స్ మీటింగ్‌లో ఏజెంట్‌ను పట్టుకోగలమా..? అని అడుగుతుంటే..అతడు ఎవరి ఊహలకు అందని వ్యక్తి. సాక్షి ఉండరు, ఫోరెన్సిక్ సాక్ష్యం ఉండదు. అతడి డెత్ నోట్ ఇప్పటికే రాయబడద్ది సార్ అంటున్నాడు మమ్ముట్టి. ఇక అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో స్టైలిష్‌గా, ఫన్‌గా ఆయుధాలు ఆపరేట్ చేస్తూ యాక్షన్ సీన్లలో అదరగొట్టేస్తున్నాడు.
టీజర్ కొత్తగా సాగుతూ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి మంచి ట్రీట్ అందించడం ఖాయమని చెబుతోంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కీ రోల్ చేస్తున్నాడు. ఇప్పటివరకు కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన సాక్షి వైద్య (Sakshi vaidya) ఈ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది. ఆగస్టు 12న విడుదల కానుంది ఏజెంట్.