Chiranjeevi | ‘సినీ పరిశ్రమలో కష్టాన్ని నమ్ముకొని నిజాయితీగా పనిచేస్తేనే విజయాలు వరిస్తాయి. ఆ సిద్ధాంతమే నటుడిగా నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. కొత్తతరం ఇండస్ట్రీలోకి రావాలి. అనుభవజ్ఞుల సలహాలు స్వీకరిస్తూ మంచి ఫలితాల్ని అందుకుంటూ వారు ముందుకుసాగాలి’ అని అన్నారు అగ్రహీరో చిరంజీవి. గురువారం హైదరాబాద్‌లో ‘11:11’ చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్‌ను ఆయన విడుదలచేశారు.
సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా నటిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకుడు. గాజుల వీరేష్ నిర్మాత. వర్ష విశ్వనాథ్ కథానాయిక. చిరంజీవి మాట్లాడుతూ ‘హీరోగా నా ఉన్నతిలో సంగీతదర్శకద్వయం రాజ్-కోటి కీలకభూమిక పోషించారు. వారిద్దరితో నేను పన్నెండు సినిమాలు చేశా. అందులో 90శాతం పాటలు విజయవంతమయ్యాయి. కోటిని నేను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటా. అతడిలో పాజిటివ్నెస్ అంటే నాకు ఇష్టం. కోటి తనయుల్లో ఒకరు హీరోగా, మరొకరు సంగీత దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. కళామతల్లిని నమ్ముకున్న వాళ్ల్లు ఎవరూ చెడిపోలేదు. కష్టాన్ని నమ్ముకొని వారు ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరుకోవాలి. రాజీవ్‌కు ఈ సినిమా మంచి బ్రేక్‌ను ఇవ్వాలి’ అని తెలిపారు.
‘ప్రతిభను, కొత్తదనాన్ని చిరంజీవి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ‘యముడికి మొగుడు’ సినిమా కోసం తొలిసారి ఆయనతో కలిసి పనిచేశా. ఆయన సహకారం వల్ల సంగీతదర్శకుడిగా నాకు మంచి గుర్తింపువచ్చింది. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రమిది’ అని కోటి అన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏది లేదని చాటిచెప్పిన వారిలో చిరంజీవి ఒకరని, తమ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిరంజీవి విడుదలచేయడం ఆనందంగా ఉందని నిర్మాత వీరేష్ చెప్పారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుపుతున్నామని, మణిశర్మ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెండ్ చిత్రమిదని రాజీవ్ సాలూరి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: ఈశ్వర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తమన్నా ప్లాన్స్ అన్నీ నాశనమయ్యాయట..!
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
చిరంజీవితో ఆ 45 నిమిషాలు మరిచిపోలేను.. సుధాకర్ ఎమోషన్
mega154 | చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో?
పూరీ, చిరంజీవి కాంబినేషన్ రెడీ.. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి..?
మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్.. నిర్మాత ఎవరో తెలుసా..?