వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
ఇన్ని రోజులు మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు ఉన్నారు. ఒకరు కాకపోతే మరొకరు అంటూ వాళ్ల చుట్టూ తిరిగారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వాళ్లకు మరో బెస్ట్ ఆప్షన్ దొరికింది. ఆ ఆప్షన్ పేరు వైష్ణవ్ తేజ్.

ఇన్ని రోజులు మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు ఉన్నారు. ఒకరు కాకపోతే మరొకరు అంటూ వాళ్ల చుట్టూ తిరిగారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వాళ్లకు మరో బెస్ట్ ఆప్షన్ దొరికింది. ఆ ఆప్షన్ పేరు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో సంచలన ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ హీరో అయిపోయాడు. ఈయన కోసం ఇప్పుడు దర్శకులు క్యూ కడుతున్నారు. రామ్ చరణ్ సహా ఇండియాలో డెబ్యూ హీరోల రికార్డులన్నీ ఒక్క సినిమాతోనే తుడిచేశాడు వైష్ణవ్. దాంతో ఈయనతో సినిమాల కోసం నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. మరోవైపు హిట్ వచ్చిన తర్వాత వైష్ణవ్ కూడా తొందరపడటం లేదు. మెల్లగా జాగ్రత్తగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన క్రిష్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఉప్పెన షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమాను పూర్తి చేశాడు వైష్ణవ్. కొండపాలం పేరుతో ఈ సినిమా వస్తుంది. ఆ నవల ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ కావడం విశేషం. సినిమా అంతా అడవిలోనే ఉంటుంది. ఉప్పెనకు ముందు ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం భారీ రేట్ అడుగుతున్నారు నిర్మాతలు. దాదాపు రూ.14 కోట్ల వరకు క్రిష్ సినిమా బిజినెస్ చేస్తుంది.

మరోవైపు మూడు, నాలుగు సినిమాలను కూడా ముందుగానే లైన్ లో పెట్టేశాడు వైష్ణవ్ తేజ్. తాజాగా ఆయన మూడో సినిమా తమిళ దర్శకుడు గిరీశయ్యతో కమిట్ అయ్యాడు. తమిళ్ అర్జున్ రెడ్డి సినిమాను ఆయన తెరకెక్కించాడు. ఈయన చెప్పిన కథ నచ్చి వైష్ణవ్ సినిమా చేస్తున్నాడు.

అలాగే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఈయన ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు ఒకరు చెప్పిన కథ నచ్చి మెగా మేనల్లుడితో సినిమా నిర్మిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా కోసం వైష్ణవ్ తేజ్‌కు మూడు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఈయన ఐదో సినిమా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాని కోసం ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఇప్పుడు వైష్ణవ్‌కు సెట్ చేస్తున్నారు. అక్కడ నో చెప్పడంతో.. ఈయన ఎస్ చెప్పాడు. దాంతో నాలుగో సినిమా అక్కడ చేయబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఏదేమైనా కూడా ఒక్క సినిమాతోనే 5 సినిమాలను లైన్ లో పెట్టేశాడు మెగా చిన్న మేనల్లుడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
కోవిడ్ టీకా తీసుకున్న మలైకా అరోరా
నాగార్జున కోసం చిరు వంట..ట్రెండింగ్‌లో స్టిల్
మెగా మేనల్లుడి మూడో చిత్రం షురూ..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ గురించి అంజలి ఏమన్నదంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

