Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ (సోమవారం) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గత వారం స్టాక్ మార్కెట్ ర్యాలీ పెట్టుబడిదారుల (Investers) కు కొంత ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ.. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. సోమవారం బ్యాంకింగ్ స్టాక్‌ల (Banking stocks) లో భారీ పతనం కనిపిస్తోంది.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ (సోమవారం) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గత వారం స్టాక్ మార్కెట్ ర్యాలీ పెట్టుబడిదారుల (Investers) కు కొంత ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ.. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. సోమవారం బ్యాంకింగ్ స్టాక్‌ల (Banking stocks) లో భారీ పతనం కనిపిస్తోంది. పెరుగుతున్న ముడి చమురు (Crude Oil) ధరలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దాంతో దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
నేటి ట్రేడింగ్‌లో మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,000 పాయింట్లు పడిపోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 295 పాయింట్లు క్షీణించింది. ఈ రెండు ప్రధాన సూచీల్లో తమ గత రెండు సెషన్ల లాభాల పరంపరకు బ్రేక్ పడింది. అయితే ఈ నష్టాలు లార్జ్-క్యాప్ స్టాక్‌లకే పరిమితం కాలేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు కూడా నష్టాలు మూటగట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ శుక్రవారం ముగింపు నాటి రూ.4,72,62,167 కోట్ల నుంచి సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి రూ.4,68,17,995 కోట్లకు పడిపోయింది. దాంతో పెట్టుబడిదారులు సుమారు రూ.4 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ భారీ అమ్మకాలకు అనేక కారణాలున్నాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల సూచీల నష్టాలు, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర నిధుల తరలింపు, పెరిగిన ముడి చమురు ధరలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేశాయి. దాంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీలు నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

