BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
BRS Leaders | ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి, వారి కష్టాలను తీర్చేందుకు ముందుకొచ్చే నాయకులపై ప్రజలు చూపించే అభిమానం మాటల్లో చెప్పలేని ది.
దస్తురాబాద్ : కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకోవడమే నిజమైన కృతజ్ఞతకు నిదర్శనం. పదవులు ఉన్నప్పుడే కాదు. పదవులు లేనప్పుడు ప్రజల కోసం చేసిన సేవలు గుర్తుండిపోతాయి. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి, వారి కష్టాలను తీర్చేందుకు ముందుకొచ్చే నాయకులపై ప్రజలు చూపించే అభిమానం మాటల్లో చెప్పలేని ది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది నిర్మల్ ( Nirmal District ) జిల్లా దస్తురాబాద్ మండలం మున్యాల గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ ( Ravinder ) కుటుంబం .

ఉపాధి కోసం మలేషియా ( Malasia ) వెళ్లిన రవీందర్ అక్కడ జైల్లో చిక్కుకోని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పుడు స్వదేశానికి తిరిగి వస్తానో తెలియని పరిస్థితుల్లో, కుటుంబ సభ్యులు సైతం ఆందోళనకు గురియ్యారు. అలాంటి క్లిష్ట సమయంలో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ స్పందించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహాకారంతో రవీందర్‌ను సురక్షితంగా స్వదేశానికి తీసుకరావడానికి కృషి చేయడంతో రవీందర్ క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన రవీందర్ మున్యాల గ్రామంలో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకుని కష్టకాలంలో అండగా నిలిచిన జాన్సన్ నాయక్‌ను, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ముద్రించుకుని ప్రతిరోజు వారిని గుర్తు చేసుకుంటున్నాడు. తనను ఆదుకున్న వ్యక్తులు తన గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని రవీందర్ వెల్లడించారు .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

