Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
Abhilasha Godishala | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వెలుగు’ దినపత్రిక ప్రచురించిన కేసీఆర్ ఫామ్‌హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ తప్పుడు కథనాన్ని బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తీవ్రంగా ఖండించారు.
Abhilasha Godishala | అక్టోబర్ 17న వెలుగు దినపత్రిక మొదటిపేజీలో ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ పేరిట తప్పుడు కథనాన్ని ప్రచురించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేస్తున్నతప్పుడు ప్రచారంపై ఖండాంతరాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వెలుగు’ దినపత్రిక ప్రచురించిన కేసీఆర్ ఫామ్‌హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ తప్పుడు కథనాన్ని బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై అధికారిక ఆధారాలు లేకుండా సంచలన శీర్షికలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమంజసం కాదని, సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించకుండా, సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా సంచలనం కోసo, రాజకీయ దురుద్దేశంతో ఈ కథనాన్ని ప్రచురించారని అభిలాష గొడిశాల విమర్శించారు.
కేసీఆర్ పేరును ఉపయోగించుకొని వివాదాలు సృష్టించడం, బీఆర్ఎస్ నాయకత్వంపై బురదజల్లడం, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై అపోహలు సృష్టించడం, అప్రతిష్ట పాలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపింది. వార్తా పత్రికను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చి, పత్రికా స్వేచ్ఛ ముసుగులో నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదని, స్వేచ్ఛకు బాధ్యత కూడా ఉండాలని, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే ఆరోపణలకు తగిన ఆధారాలు కూడా ఉండాలని అభిలాష పేర్కొన్నది.
పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తాం..
పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తాం. ప్రజల తరఫున ప్రశ్నించే జర్నలిజాన్ని సమర్థిస్తాం. అదే సమయంలో, వ్యక్తుల గౌరవానికి, ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే ఆరోపణలను బాధ్యతారహితంగా ప్రచురించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ కుట్రపూరిత దుష్ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలం అందరం ఐక్యంగా తిప్పికొడతామన్నారు. ఈ కథనానికి సంబంధించిన ఆధారాలను వెలుగు యాజమాన్యం బహిర్గతం చేయాలని, ఆరోపణలను నిరూపించలేకపోతే కథనాన్ని ఉపసంహరించుకొని, మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా క్షమాపణ ప్రచురించాలని కోరారు. డిజిటల్ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ అదే వివరణ ఇవ్వాలని అభిలాష డిమాండ్ చేశారు.
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

