attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
attack on bus | జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఆ బస్సు డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్నారు. ఉగ్రవాద వాహనానికి నిప్పుపెడతామని, ప్రయాణికులను చంపుతామని వారు బెదిరించారు. ఈ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసం కావడంతో ఒక ప్రయాణికుడు గాయపడ్డాడు.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఆ బస్సు డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్నారు. ఉగ్రవాద వాహనానికి నిప్పుపెడతామని, ప్రయాణికులను చంపుతామని వారు బెదిరించారు. ఈ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసం కావడంతో ఒక ప్రయాణికుడు గాయపడ్డాడు. అక్టోబర్ 17న రాత్రి 10.30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రయాణికుల భోజనం కోసం హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఒక ధాబా వద్ద ఆగింది. అక్కడ ఒక కారు కూడా పార్క్ చేసి ఉన్నది.
కాగా, ఆ కారులోని ఇద్దరు వ్యక్తులు, బస్సు ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సును ఉగ్రవాద వాహనంగా, డ్రైవర్‌ను ఉగ్రవాదిగా వారు పేర్కొన్నారు. ‘ఈ ఉగ్రవాద వాహనాన్ని ఇక్కడి నుంచి తీసివేయండి’ అని అరిచారు. ఆ బస్సు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు.
అయితే బస్సు డ్రైవర్ ప్రశ్నించగా ఆ ఇద్దరు వ్యక్తులు మరింతగా రెచ్చిపోయారు. బస్సుపైకి రాళ్లు, ఇటుకలు విసిరారు. బస్సులోని వారిని కాల్చివేస్తామని, బస్సుకు నిప్పు పెడతామని, వారిని చంపేస్తామని బెదిరించారు. జమ్ముకశ్మీర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం హర్యానాలో ఉండటాన్ని మరికొందరు వ్యతిరేకించారు. ఈ రాళ్ల దాడిలో బస్సు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. వృద్ధుడైన ఒక ప్రయాణికుడు గాయపడ్డాడు. ఈ సంఘటన తర్వాత ఆ బస్సు అక్కడి నుంచి బయలుదేరింది.
మరోవైపు జమ్ముకశ్మీర్ బస్సుపై హర్యానాలో దాడి జరిగిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కశ్మీరీ ప్రయాణికుల పట్ల శత్రుత్వంతో ఈ దాడి జరిగిందా అన్న దానిపై విచారణ జరుపాలని పలువురు డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసులను ఎక్స్ పోస్ట్‌లో ఆయన కోరారు.
ఈ పరిణామాల నేపథ్యంలో హర్యానా పోలీసులు స్పందించారు. జమ్ముకశ్మీర్ బస్సుపై దాడి చేసిన వారిని మోహిత్, సావన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్, దారి విషయంలో జరిగిన వివాదమే ఈ దాడికి కారణమని, మతపరమైన దాడి కాదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
అయినప్పటికీ సుమోటోగా పరిగణించి నిందితులపై చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారి వివరించారు. బస్సుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడానికి యువకులు అంగీకరించడంతో ఇరుపక్షాలు రాజీకి వచ్చాయని అన్నారు. ‘ఇది మత సంబంధమైన విషయం కాదు. శాంతి కోసం మేం విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆ పోలీస్ అధికారి స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

