Mega 158 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న తాజా ప్రాజెక్ట్ మెగా 158. “ది స్పిరిట్ ఆఫ్ మెగా 158” పేరుతో రిలీజ్ చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది.
కొన్ని రోజులుగా కొనసాగుతున్న మెగా 158 పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా సెట్స్‌లో చిరు అండ్ టీం దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రధాన తారాగణంపై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో పూర్తి చేశారని సమాచారం. కాగా నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిరు అండ్ బాబీ టీం సిద్దమవుతుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్పై క్లారిటీ ఇవ్వనుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో నివేదా పేతురాజ్, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాబీ గత చిత్రాల్లో చూపించిన మాస్ ఎలిమెంట్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ సినిమాను మరో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
#Mega158 Pollachi Schedule Wrapped ❤️🔥
The team of #ChiruBobby2 has successfully completed a high-energy schedule, canning important portions featuring the principal cast 💥
With the next schedule set to begin soon, the team is all geared up to set the BLOODY BENCHMARK 🔥
More… pic.twitter.com/ZPZSHrHT1i
— BA Raju’s Team (@baraju_SuperHit) June 11, 2026
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’