Meesaala Pilla| టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట రౌండప్ చేస్తోంది. మరోవైపు మీసాల పిల్ల సాంగ్ నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ ఇండియావైడ్‌గా యూట్యూబ్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో అరుదైన మార్క్ దిశగా వెళ్తుంది మీసాల పిల్ల సాంగ్.
యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఈ పాట 90 మిలియన్ల మార్క్ దాటి.. 100 మిలియన్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. 2025 చివరి నాటికి ఈ మార్క్ చేరుకోవడం ఖాయమని అంచనాల వేస్తున్నాడు ట్రేడ్ పండితులు. మొత్తానికి ఈ ఏడాది విడుదలైన టాలీవుడ్ సాంగ్స్‌లో టాప్‌లో 10లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం) ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
భీమ్స్ సిసీరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనుండగా.. విడుదల తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
The chartbuster vibe of #MeesaalaPilla continues to be loved by the audience ❤️🔥❤️🔥❤️🔥
90MILLION+ VIEWS for the Mega Grace of #ManaShankaraVaraPrasadGaru 💥
— https://t.co/4dgILT3sv8#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY ❤️🔥
Megastar @KChiruTweets
Victory… pic.twitter.com/NNqRKNF4KO— Shine Screens (@Shine_Screens) December 21, 2025