Meerpet Murder Case | అనుమానంతో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకటమాధవి (venkata madhavi)ని అత్యంత కిరాతకంగా చంపి, ఆమె శరీరభాగాలను దొరకకుండా చేసి చెరువులో పడేసిన అమానుష ఘటన హైదరాబాద్ మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు కాగా.. కుటుంబ కలహాలే హత్యకు దారి తీసినట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
ఇటీవల విడుదలైన ఓ మలయాళ సినిమాను ప్రేరణగా తీసుకొని గురుమూర్తి ఈ హత్య చేశాడట. నజ్రియా నజీమ్ నటించిన మలయాళ క్రైం థ్రిల్లర్ సూక్ష్మదర్శిని (sookshmadarshini) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
గురుమూర్తి ఈ సినిమాను చూసిన తర్వాత తన భార్యను హత్య చేసేందుకు ప్రణాళిక రచించాడని పోలీసులు పేర్కొన్నారు. సినిమాలో హత్య సన్నివేశం ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపించిందని.. ఆ సీన్‌ను స్పూర్తిగా తీసుకొని ఈ హత్య చేశాడట గురుమూర్తి.
విషయం బయటకు వచ్చిందిలా..!
తన కూతురు ఫోన్ చేయకపోవడంతో వెంకటమాధవి తల్లిదండ్రులు స్వయంగా వచ్చి గురుమూర్తిని ప్రశ్నించారు. కన్పించకుండా పోయిందని, మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నట్టు వారితో చెప్పాడు. అల్లుడిపై అనుమానంతో తామే వెళ్లి ఫిర్యాదు చేస్తామంటూ వెళ్లిపోయారు. 16న గొడవ జరిగిందని, ఆ తర్వాత నుంచి కన్పించడం లేదంటూ వెంకటమాధవి తల్లి 18న మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదైంది. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే భర్తపై అనుమానం రావడంతో పోలీసులు అతనిపై ఓ కన్నేశారు. దీంతోపాటు ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్నంగా పరిశీలించారు. సీసీ కెమెరాలలో ఒక సంచిని ఇంట్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కన్పించాయి. దీని ఆధారంగా పోలీసులు గురుమూర్తిని విచారించడంతో ఒక్కొక్క విషయం బయటపడిందని సమాచారం.
చట్టానికి దొరకొద్దని..
భార్యను చంపి ఆమె మృతదేహం అనవాళ్లు లేకుండా చేస్తే దొరకకుండా ఉంటానని దుండగుడు మరో పథకం పన్నాడు. దాన్ని అమలు చేసేందుకు దృశ్యం సినిమాను పలుమార్లు చూశానంటూ పోలీస్ విచారణలో వెల్లడించినట్టు సమాచారం. గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి, కుక్కర్లో ఉడికించి దానిని చెరువులో పడేశాడని, ఆ ముక్కల కోసం చెరువులో పోలీసులు మూడురోజులుగా గాలిస్తున్నా, ఆనవాళ్లు దొరకలేదని తెలిసింది.
Pushpa 2 on OTT | ఓటీటీలోకి ‘పుష్ప 2 ది రూల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ