ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 14, 2020 , 09:43:42

బంధుప్ర‌తి వ‌ల్లే విజ‌య్, సూర్య ఈ పొజీష‌న్‌లో ఉన్నారు: హీరోయిన్

బంధుప్ర‌తి వ‌ల్లే విజ‌య్, సూర్య ఈ పొజీష‌న్‌లో ఉన్నారు:  హీరోయిన్

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత నెపోటిజం అనే దానిపై హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. న‌ట వార‌స‌త్వం ఎంతో మందిని అణ‌గ‌దొక్కేలా చేసింద‌ని కొంద‌రు గొంతెత్తి గోడు వెళ్ళ‌బోసుకుంటున్నారు. బాలీవుడ్‌లో కంగ‌నా దీనిపై పెద్ద ఫైటే చేస్తుంది. ఇక త‌మిళంలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌, నటి  మీరా మిథున్ బంధుప్రీతిపై సంచ‌ల‌న వ్యాఖ్‌య‌లు చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. మొన్నామ‌ధ్య త్రిష‌కి కుల పిచ్చి ఎక్కువ‌ని, త‌న‌కు రావ‌ల‌సిన ఆఫ‌ర్స్ అన్నీ తానే పొందింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. అంత‌టితో ఆగ‌కుంగా త‌న‌ని తొక్కేయ‌డానికి కూడా త్రిష ప్ర‌య‌త్నించింద‌ని పేర్కొంది మీరా.

ఇక తాజాగా త‌మిళ సూప‌ర్ స్టార్స్ విజ‌య్, సూర్య‌ల‌కి విరుచుకుప‌డింది మీరా మిథున్. కోలీవుడ్‌లోను బంధుప్రీతి ఉంద‌ని ఆ కార‌ణంగానే విజ‌య్, సూర్య‌లు ఈ స్థాయిలో ఉన్నారని విమ‌ర్శించింది. నెపోటిజంతోనే వారు తెర‌కి ప‌రిచ‌యం అయ్యారంటూ అనేక విమ‌ర్శ‌లు చేసింది. మీరా వ్యాఖ్య‌ల‌పై స్పందించిన సూర్య‌.. కొందరు చేసే త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై మ‌నం స్పందించాల్సిన అవ‌స‌రం లేదు. స‌మ‌యాన్ని వృథా చేయోద్దు. స‌మాజం కోసం, మంచి ప‌నుల‌కోసం విలువైన స‌మ‌యాన్ని వాడుకుందాం అని పేర్కొన్నారు. మీరా వ్యాఖ్య‌లు కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతుండ‌గా.. విజ‌య్, సూర్య ఫ్యాన్స్ ఆమెని సోష‌ల్ మీడియా ద్వారా తెగ ట్రోల్ చేస్తున్నారు. నాకు ఏదైన హాని జ‌రిగితే అందుకు కార‌ణం సూర్య‌, విజ‌య్  అవుతారంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేసింది మీరా.


logo