Meenakshi Sheshadri | ఔరా అమ్మక చెల్లా.. ఆలకించి నమ్మటమెల్లా.. అంత వింత గాథల్లో ఆనందలాలా..! ఈ ఆల్టైమ్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ తెలియని తెలుగు మూవీ, మ్యూజిక్ లవర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ పాట కె విశ్వనాథ్ డైరెక్షన్లో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి కాంబోలో వచ్చిన ఆపద్భాంధవుడు సినిమాలోనిదని తెలిసిందే.
సినిమా వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా ఈ పాటకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సాంగ్లో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి డ్యాన్స్ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఆ పాటను రీక్రియేట్ చేసింది మీనాక్షి శేషాద్రి. 62 ఏండ్ల వయస్సులోనూ లంగావోణిలో హొయలు పోతూ ఆనాటి రోజులను గుర్తు తెచ్చేలా మీనాక్షి చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆపద్బాంధవుడు హీరోయిన్ మీనాక్షి శేషాద్రి వయసు 62 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అదే చలాకీతనంతో తన పాటకు డాన్స్ చేయడం స్ఫూర్తి చెందాల్సిన విషయం pic.twitter.com/Jowsjv3wCn
— Ravindranath Sriraj (@ravindraraj11) April 16, 2026
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్