Sonia Gandhi Book : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజా పుస్తకం ‘Belonging’ ముద్రణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. కొన్నిరోజులుగా ఈ బుక్‌ను పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ముద్రించనుందని వస్తున్న వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది. శుక్రవారం ఓ ప్రకటనలో తాము Belongingను ప్రచురించడం లేదని పెంగ్విన్ ప్రకటించింది. ఆ పుస్తకంలో కొన్ని మార్పుల చేసేందుకు సోనియా నిరాకరించారనే వార్తల నేపథ్యంలో స్పష్టతనిచ్చిందీ సంస్థ.
ఆరు దశాబ్దాలకుపైగా తన జీవతంలో చవిచూసిన సంఘటనలతో సోనియా గాంధీ Belonging : A Journey of Love అనే పుస్తకం రాశారు. ఇందులో ఆమె తన కుటుంబం, అత్త ఇందిరా గాంధీ.. భర్త రాజీవ్ గాంధీలపై ఆత్మాహుతి దాడులను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా సేవలందించిన ఆమె రాసిన Belonging పుస్తకం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో సోనియా బుక్‌ను పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా పబ్లిష్ చేయడం లేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా స్పష్టం చేసింది.
Penguin Random House India official statement. pic.twitter.com/2g8y3F1p7m
— Penguin India (@PenguinIndia) August 28, 2026
‘Belonging : A Journey of Love పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా పబ్లిష్ చేయట్లేదు. రచయిత సోనియా కొన్ని మార్పులకు నిరాకరించిన నేపథ్యంలోనే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఈ బుక్‌ను ప్రచురించడం లేదనేది ప్రస్తుత నిర్ణయానికి సరైన కారణం కాదు అని శుక్రవారం పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెల్లడించింది. అదే సమయంలో.. తాము సోనియా పుస్తకాన్ని ముద్రించేందుకు సిద్ధంగా ఆసక్తిగా ఉన్నామని పేర్కొందీ సంస్థ. అయితే.. ఏదైనా పుస్తకాన్ని ప్రచురించే ముందు రచయితకు సంబంధించిన వివరాలు సరిచూసుకోవడం, అవసరమైన మార్పులను సూచించడం తమ బాధ్యత’ అని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా తెలిపింది. దీంతో.. Belonging పుస్తకం గురించి సోనియాతో మాట్లాడినట్టు పెంగ్విన్ చెప్పకనే చెప్పింది.

‘ఏదైనా పుస్తకాన్ని ముద్రించడానికి ముందు రచయితకు సంబంధించిన నిజానిజాలను సరిచూసుకోవడం, వారికి ఉపకరించేలా పుస్తకంలో అవసరమైన మార్పులను సూచించడం పబ్లిషర్‌గా మా బాధ్యత. ఇది పబ్లిషింగ్‌లో మామూలే. Belonging పుస్తకంపై జరిగిన చర్చల అనంతరం.. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఈ బుక్‌ను ముద్రించేందుకు ఆసక్తి చూపిస్తోంది. రచయితతో జరిగిన చర్చలపై ఇకపై మేము ఎలాంటి కామెంట్ చేయం’ అని పెంగ్విన్ సంస్థ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించింది.
ప్రస్తుతం ఈ సంస్థ వెనకడుగేసినందున.. పలు ముద్రణ సంస్థలు Belongingను తీసుకొచ్చేందుకు ముందుకొస్తున్నాయని.. హార్పర్ కొలిన్స్‌తో హక్కుల కోసం సంప్రదిస్తున్నాయని సమాచారం. ఇదిలాఉండగా.. అమెరికాలోని దిగ్గజ ముద్రణ సంస్థకు చెందిన అల్ఫ్రెడ్ ఏ నాఫ్స్ నవంబర్ 10వ తేదీన సోనియా గాంధీ పుస్తకం విడుదల అవుతుందని చెప్పారు. Belongingలో తన కుటుంబం గురించి చాలా విషయాలు రాశానని, కొన్ని విషయాలు వారికి ప్రేరణగా నిలుస్తాయని సోనియా పేర్కొన్నట్టు అల్ప్రెడ్ పేర్కొన్నారు.