Ap brand ambassador | టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరికి అరుదైన అవకాశం లభించినట్లు తెలుస్తుంది. మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా శక్తీకరణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన అధికారికంగా వెలువడనున్నట్లు సమాచారం. కాగా దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
సినిమాల విషయానికి వస్తే.. గతేడాది గుంటూరు కారం, లక్కీ భాస్కర్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న మీనాక్షి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం అనగనగా ఒకరోజుతో పాటు చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తుంది మీనాక్షి.