గత ఏడాది ‘లక్కీ భాస్కర్’తో భారీ విజయాన్ని అందుకున్న మీనాక్షి చౌదరి.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఏకంగా మూడొందల కోట్ల విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంత విజయం తర్వాత మీనాక్షి ఫుల్ బిజీ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఖాతాలో నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒకరోజు’ సినిమా మినహా మరో సినిమా లేదు.
అంత సక్సెస్ తర్వాత స్పీడ్ పెరగాలి కానీ.. తగ్గడమేంటి అని అంతా అనుకుంటున్న తరుణంలో.. భారీ అవకాశం ఈ అందాలభామను వరించింది. అయితే.. ఆ అవకాశం టాలీవుడ్లో కాదు, బాలీవుడ్లో. బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘ఫోర్స్’ మూడో భాగం తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరి ఎంపికయ్యారు.
మీనాక్షితో ఈ టీమ్ చర్చలు జరపడం, ఆమెకు కథ నచ్చి అంగీకరించడం కూడా జరిగిపోయింది. ఓ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్లో హీరోయిన్గా లాంచ్ అవుతున్నందుకు మీనాక్షి చౌదరి ఆనందానికి అవధుల్లేవ్. విపుల్ అమృత్లాల్షా, జాన్ అబ్రహం కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు నిషికాంత్ కామత్.