విశ్వక్సేన్ నుంచి రాబోతున్న సినిమా ‘మెకానిక్ రాకీ’. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచారంలో వేగం పెంచారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించి, ‘ట్రైలర్ 1.0’ పేరుతో ట్రైలర్‌ని విడుదల చేశారు.
వినోదాత్మకమైన అంశాలతోపాటు మాస్‌కి కావాల్సిన యాక్షన్ ఎలిమెంట్స్‌ని కూడా కలగలిపి ఈ ట్రైలర్‌ని మేకర్స్ కట్ చేశారు. యంగ్ మెకానిక్‌గా విశ్వక్సేన్ డాన్సులు, ఫైట్లు ఈ ట్రైలర్లో చూడొచ్చు. అలాగే హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్లతో విశ్వక్సేన్ కెమిస్ట్రీ, నరేశ్‌తో కామెడీ సీన్స్ ట్రైలర్లో ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. సునీల్ ఇందులో విలన్‌గా చేస్తున్నట్టు ట్రైలర్ చెబుతున్నది. విశ్వక్, సునీల్‌కి నడుమ క్లాష్ సీన్స్ కూడా మాస్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. వైవా హర్ష, హర్షవర్దన్, రోడీస్ రఘురామ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కటసాని, సంగీతం: జేక్స్ బిజోయ్.