ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 13:46:31

నందు, ర‌ష్మీ జంట‌గా బొమ్మ బ్లాక్ బస్టర్.. టీజ‌ర్

నందు, ర‌ష్మీ జంట‌గా బొమ్మ బ్లాక్ బస్టర్.. టీజ‌ర్

నందు ఆనంద్ కృష్ణ‌, ర‌ష్మీ గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో  కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ ప‌గ‌డాల నిర్మించాడు. నందు, ర‌ష్మీల పాత్ర‌లు ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ర‌ష్మీ గ‌తంలో ప‌లు చిత్రాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమాతో తానేంటో నిరూపించుకోనుంది. మ‌రోవైపు రష్మీ, నందుల‌ లవ్ ఇంట్రెస్ట్‌గా ఉండ‌నుంద‌ట‌. ఈ సినిమాలో నందు పోతురాజు పాత్రలో, పూరీ జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తారు. 

ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుద‌ల కాగా, దీనిని చూస్తుంటే మూవీ  కొంత లవ్, కొంత కామెడీ మరికొంత యాక్షన్ ఫిల్మ్‌లా కనిపిస్తోంది. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే చిత్ర‌ టైటిల్ కి త‌గ్గ‌ట్లుగానే సినిమా కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ప‌క్క‌గా ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంటున్నారు. కాగా, నందు చివ‌రిగా స‌వారి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌లేకపోయింది. logo