Irumudi Theme Song | రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రాబోతున్న ‘ఇరుముడి’ పవర్ఫుల్ థీమ్ సాంగ్!
Irumudi Theme Song | మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 'ఇరుముడి' నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.
Irumudi Theme Song | మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన సాంగ్ అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా అభిమానుల నుంచి వస్తున్న భారీ రిక్వెస్ట్‌లను పరిగణనలోకి తీసుకుని, ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ ‘ఇరుముడి’ థీమ్ సాంగ్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పాట ‘విళ్లాది వీరుడు వీర మణికంఠుడు’ అనే పవర్ఫుల్ అయ్యప్ప స్వామి భక్తి గీతంగా ఉండబోతోందని తెలుస్తుంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ (The Heart of Irumudi) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ఇందులో రవితేజ ఒక ఎమోషనల్ తండ్రి పాత్రలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. కూతురి కోసం ఒక తండ్రి పడే తపన, మద్యపానానికి దూరమై అయ్యప్ప దీక్ష స్వీకరించి ఆధ్యాత్మిక మార్గంలో సాగే ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురిగా కీలక పాత్ర పోషిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఆగస్టు 2026లో థియేటర్లలోకి రానుంది.
After a lot of requests … we are releasing the #irumudi theme soon ❤️ …. @RaviTeja_offl @ShivaNirvana @MythriOfficial
— G.V.Prakash Kumar (@gvprakash) June 4, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

