Mass Maharaja Raviteja | మాస్ మహారాజ రవితేజకు షూటింగ్లో ప్రమాదం జరిగింది. రవితేజ 67 ప్రాజెక్ట్ షూటింగ్ సమయంలో రవితేజకు ప్రమాదం జరుగగా.. అతడి కుడిచేతికి గాయం అయ్యింది. అయితే నొప్పిభరిస్తునే షూటింగ్లో పాల్గోన్నాడు రవితేజ. అయితే షూటింగ్ అనంతరం ఈ గాయం ఎక్కువ కావడం వలన చిత్రబృందం ఆయనను ఆస్పత్రికి తరలించారు. రవితేజను పరిశీలించిన వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి, ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇక రవితేజకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న అతని అభిమానులు ఆస్పత్రికి తరలివస్తున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా హిట్లు లేక సతమవుతున్నాడు రవితేజ. గత ఏడాది రావణసుర, టైగర్ నాగేశ్వర రావు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్లు అందుకున్నాడు. అయితే ఈ ఏడాది కూడా రవితేజకు కలిసి రాలేదు. ఈగల్ అంటూ ఈ ఏడాది ముందుకు వచ్చి ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్గా మిస్టర్ బచ్చన్ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో ఫ్లాప్‌ను ముటగట్టుకున్నాడు.
Also Read..