Gangs Of Godavari | ఇటీవలే ‘గామి’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు యువ హీరో విశ్వక్సేన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు మాట్లాడుతూ..
‘1960దశకంలో గోదావరి జిల్లాల్లో చీకటి ప్రపంచం నుంచి ఓ సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. విశ్వక్సేన్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యువన్‌శంకర్ రాజా సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఆనాటి వాతావరణాన్ని కళ్లకుకట్టినట్లుగా ఆవిష్కరిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిత్ మాదాడి, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, దర్శకత్వం: కృష్ణచైతన్య.