‘ఇడియట్’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..’ సాంగ్ ఎంత హిట్టో తెలిసిందే. దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరపరిచి, స్వయంగా ఆలపించిన ఆ పాట రాష్ర్టాన్ని ఓ ఊపు ఊపేసింది. మళ్లీ ఆ పాటను.. ఆ ఫ్లేవర్‌నూ గుర్తుచేస్తూ.. శ్రోతలకు ఓ మ్యూజికల్ ఫేవర్ చేశారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. రవితేజ నటించిన ‘మాస్ జాతర’ సినిమా కోసం ఆయన ఈ పాటను స్వరపరిచారు. అంతేకాదు, కృత్రిమ మేధా(AI) ని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి సృష్టించారు.
‘తు మేరా లవర్ లవర్ లవర్.. తుజ్ కో దియా ఫ్లవరూ.. తు మేరా లవర్ లవర్ లవర్.. పెట్టావే చెవిలో క్యాలీఫ్లవరూ..’ అంటూ సాగిన ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాయగా..‘ఇడియట్’లోని ఐకానిక్ సాంగ్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..’ పాటకు నివాళిగా మేకర్స్ ఈ పాటను అందించారు. రవితేజ శైలి డాన్స్, శ్రీలీల అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఈ పాట సినిమాకే హైలైట్ కానుందని మేకర్స్ తెలిపారు. త్వరలోనే విడుదల కానున్న ఈ యాక్షన్ ఎంటైర్టెనర్కు భాను బోగవరపు దర్శకుడు. ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్.