రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడొస్తుందోనని అభిమానుల్లో ఆతృత పెరిగింది. తాజాగా బుధవారం మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 31న పక్కాగా రాబోతున్నామని తెలిపారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా పోస్టర్‌తో పాటు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలో పోలీస్‌ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో కనిపించనున్నారు రవితేజ.
ఆయన శైలి వినోదం, వింటేజ్ వైబ్‌ని జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, ఆద్యంతం హాస్యంతో ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, దర్శకత్వం: భాను భోగవరపు.