Rajasaab | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ కొరియోగ్రఫర్లలో ఒకడు ప్రేమ్ రక్షిత్. ఈ స్టార్ డ్యాన్సర్ కంపోజ్ చేసిన నాటు నాటు పాట ఏకంగా గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కాగా ఇప్పుడు ప్రేమ్ రక్షిత్‌కు సంబంధించిన ఆసక్తికర ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న ప్రాజెక్టు రాజాసాబ్. ఈ మూవీలో ప్రభాస్‌లో అదిరిపోయే స్టెప్పులేయించబోతున్నాడట ప్రేమ్ రక్షిత్.
ఇటీవలే ఎక్స్‌లో అభిమానులతో చేసిన చిట్‌చాట్‌లో రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ గురించి షేర్ చేశాడు మారుతి. ప్రభాస్ గొప్ప డ్యాన్సర్‌గా పరిగణించబడడు. అతని ఫిల్మోగ్రఫీని చూస్తే పాటల్లో డ్యాన్సులు వైరల్ కావు. లక్షలాది మంది అభిమానుల్లాగే నేను కూడా ప్రభాస్‌ను అతని (ప్రేమ్ రక్షిత్ మాస్టర్) స్టైల్లో చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. నాపై ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఊహించుకోండి.
పనికట్టుకుని ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌తో కలిసి వర్క్ చేయాలనుకున్నా. ప్రేమ్ రక్షిత్చాలా బిజీగా ఉన్నాడు. అయినా కానీ అతడిని రాజాసాబ్ టీంలోకి తీసుకున్నా. అభిమానులు ఈ కాంబోలో తప్పకుండా ఆస్వాదిస్తారు.. అంటూ చెప్పుకొచ్చాడు మారుతి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేయడమే కాదు రాజాసాబ్‌పై హైప్ పెంచేస్తున్నాయి.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెలిసిందే.
Jailer 2 | చెన్నై టు కేరళ.. జైలర్ 2 గురించి రజినీకాంత్ ఏమన్నాడంటే..?
Junior | ఇక ఓటీటీలోకి గాలి కిరీటి జూనియర్.. ఇంతకీ ఏ ప్లాట్ఫాంలోనో తెలుసా..?