మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుని..సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఎంట్రీ ఇస్తోంది మానుషి ఛిల్లార్ (Manushi Chhillar). బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటించిన పృథ్విరాజ్ (Prithiviraj) లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది మానుషి. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్‌తో ఇండియాలో హాటెస్ట్ యాక్టర్లలో నిలిచాడు రాంచరణ్ (Ram Charan). దీంతో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా మరింత పెరిగిపోయింది.
ఇండస్ట్రీలో ఎవరిని ఎక్కువగా లైక్ చేస్తారని ప్రశ్నించగా..రాంచరణ్ చెప్పింది మానుషి. అంతేకాదు రాంచరణ్‌కు పెళ్లి కాకపోతే ఆయనతో డేట్‌కు వెళ్లేదాన్నని చెప్పుకొచ్చింది. మానుషి ఛిల్లార్ చేసిన కామెంట్స్ తో మెగా అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు. పృథ్విరాజ్ చిత్రంలో మానుషి యువరాణి పాత్రలో కనిపించనుండగా..ఇప్పటికే విడుదలైన లుక్కు మంచి స్పందన వచ్చింది.