Tharun Bhascker | విజయ్, నేను గల్లీలల్ల తిరుగుతుండే : తరుణ్ భాస్కర్
విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda), రీతూవర్మ, ప్రియదర్శి లాంటి కొత్త యాక్టర్లతో పెళ్లి చూపులు సినిమా తీసి..రికార్డులు సృష్టించాడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). ఈ యంగ్ డైరెక్టర్ అలీతో సరదాగా టాక్ షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
సైన్మా షార్ట్ ఫిలింతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda), రీతూవర్మ, ప్రియదర్శి లాంటి కొత్త యాక్టర్లతో పెళ్లి చూపులు సినిమా తీసి..రికార్డులు సృష్టించాడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). ఈ యంగ్ డైరెక్టర్ అలీతో సరదాగా టాక్ షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
విజయ్ దేవరకొండ ఎలా పరిచయం అని అడుగగా..విజయ్ దేవరకొండ గల్లీలల్ల థియేటర్ ఆర్టిస్టు లెక్క తిరుగుతుండే. నేను కూడా విజయ్‌తోనే అటూ ఇటూ తిరుగుతా ఉండే. మొత్తం మాది ఎయిర్ ఫోర్స్ బ్యాచ్. ఏ ఏం సినిమాలివన్నీ మనం మంచిగ తీయొచ్చు..అని చెప్పుకునే బ్యాచ్ ఒకటి ఉంటది..ఇప్పటికీ ఉంటది. హే మనం మస్త్ చేస్తం అనుకునే బ్యాచ్ మాది. జేబులో పది రూపాయలు లేదు..కానీ వెనకాలో ఓ లైన్ ఉంటది..దాని విలువ 2 కోట్లుంటది. ఇదే డైరెక్టర్ బతుకన్నాడు తరుణ్ భాస్కర్.
ఏదొస్తే అది చేసేయాలని ఫిక్సయ్యా..
జేబుల పది ఉండది కానీ వందకోట్ల ఐడియా ఉంటది. ఇట్లాంటి ఐడియాలతో తిరిగే టోడిని అని అన్నాడు తరుణ్ భాస్కర్. అదే సమయంలో విజయ్ పరిచయమైండు. యాక్టింగ్ చేసేటోడు. అతడు యాక్టర్ లుక్‌లో బాగా కనిపించేవాడు. యాక్టింగ్ చేస్తా..రా..ఏమున్నది అనేవాడు. నాక్కూడా పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు. అఖిల్, వరుణ్ తేజ్‌తో చాలా మంది యాక్టర్లను కలిశాను. ఇక ఏదొస్తే అది చేసేయాలని ఫిక్సయ్యా. అలా రాజ్ కందుకూరి, యశ్ రంగినేనితో పెళ్లి చూపులు (Pelli Choopulu) ట్రాక్పైకిఎక్కిందని చెప్పుకొచ్చాడు.
ఇక మీ అమ్మగారు యాక్టింగ్ చేయాలనే ఆలోచన ఎవరిదని అడుగగా…అమ్మ నా రెండో సినిమా ఈ నగరానికి ఏమైందిలో నటించింది. నా షార్ట్ ఫిలింలో అమ్మ ఉంటే..శేఖర్ కమ్ముల చూసి ఒకసారి ఆడిషన్‌కు తీసుకొని రా అన్నారు. శేఖర్ కమ్ములతో మీకర్థమైతలేదు సార్ ఆమె యాక్టింగ్ అంత మంచిగా చేయదన్నా. నువ్వు నాకు చెప్పకు తీసుకురా అన్నరు. ఆ తర్వాత తీసుకెళ్తే..ఫిదాలో నటించారు. ఆ సినిమా హిట్టయిపోయింది. అమ్మకు కొంత గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ఎలాంటిదంటే నిన్నెక్కణ్నో చూసినా..అక్కడివరకే ఎవరికీ తెల్వదు మళ్లా..సూపర్ మార్కెట్‌కెళ్తే నన్ను గుర్తు పడుతున్నారు చూడురా అంటుంది అమ్మ..అని చెప్పుకొచ్చాడు.
విజయ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశముందా అని అడిగితే..విజయ్ వైల్డ్ కార్డు లాంటి వాడు..ఇప్పటికింకా విజయ్‌కు నేను రిలేటబుల్గానే ఉన్నా..వరుసగా నాకు మూడు ప్లాపులు వచ్చినంక ఆ కార్డు వాడదామని పక్కన పెట్టినట్టు చెప్పాడు తరుణ్ భాస్కర్.
Read Also : Anand Mahindra | సర్కారు వారి పాట చూసేందుకు న్యూజెర్సీకి వెళతా..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Read Also : Anudeep KV | ‘జాతిరత్నం’ డైరెక్టర్ అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడుగా..
Read Also : Trivikram | విలన్ కోసం స్టార్ యాక్టర్ల పేర్లు పరిశీలిస్తోన్న త్రివిక్రమ్..!
Read Also : Ranbir Kapoor | వైజాగ్‌లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్..రణ్ బీర్‌కు ఘనస్వాగతం.వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

