Manu Bhaker | పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన భారత షూటర్ మనూ భాకర్ (Manu Bhaker) ఈ మధ్య పబ్లిక్ అప్పీరియన్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నది. ఈ 22 ఏళ్ల మనూ పారిస్ ఒలింపిక్స్‌లో ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రెండు కాంస్య పతకాలు గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. ఇటీవల ఒక స్కూల్ ఫంక్షన్లో ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తాజాగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి 16 వ సీజన్లో ముఖ్య అతిథిగా హాజరైన మను భాకర్ అమితాబ్ ముందు తన సినిమాలోని ఫేమస్ డైలాగ్ చెప్పింది.
కౌన్ బనేగా కరోడ్ పతి 16 వ సీజన్ ఎపిసోడ్ 18 సంబంధించి మేకర్స్ తాజాగా ప్రోమో విడుదల చేయగా.. ఈ ప్రోమోలో మను భాకర్ అమితాబ్ ముందు హాట్ సీట్లో కుర్చుని ఉంది. అయితే అమితాబ్‌ని అడుగుతూ.. మీ సినిమాలోని ఫేమస్ డైలాగ్ మీ ముందు చెప్పవచ్చా అని అడుగుతుంది. దీనికి తప్పకుండా అంటూ అమితాబ్ సమాధానమిస్తాడు. దీంతో మను పరంపర, ప్రతిష్ఠ, అనుశాసనం అంటూ బిగ్ బీ కెరీర్లో బ్లాక్ బస్టర్ అయిన మొహబ్బతీన్ (Mohabbatein) సినిమాలోని డైలాగ్ చెప్పింది. దీంతో షో అంతా చప్పట్లతో మారుమోగింది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Aa rahi hain Desh ki shaan Manu Bhaker KBC par sabka dil jeetne! Let’s cheer for olympic medalist #ManuBhaker
Dekhiye #KaunBanegaCrorepati #OlympiansSpecial, kal raat 9 baje sirf #SonyEntertainmentTelevision par.@SrBachchan #ManuBhakerOnKBC #KBConSonyTV #KBC16 #KBC2024 pic.twitter.com/pxwiyZUGZv
— sonytv (@SonyTV) September 4, 2024
ALso read..