మనోజ్కృష్ణ తన్నీరు, జయశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎ కఫ్ ఆఫ్ టీ’. ఎఫ్పీ రోజర్స్, నిఖిత రావు దర్శకత్వం వహిస్తున్నారు. మనోజ్కృష్ణ, నవీన్‌కృష్ణ నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ‘వాట్ హాపెండ్..’ అనే ప్రమోషనల్ గీతాన్ని విడుదల చేశారు. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయనే అంశాన్ని ఈ పాటలో ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశామని నిర్మాత తెలిపారు.
ఓ కాలేజీ యువకుడి జీవితానికి అద్దం పట్టే చిత్రమిదని, నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని, ఇందులో అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కమల్ నాబ్, సంగీతం: కార్తీక్ రోడ్రిగెజ్, రచన-దర్శకత్వం: ఎఫ్ఫీ రోజర్స్, నిఖిత రావు.